Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను గాడిద జాతివాడిని: వివాదాస్పద బాబా ఆశారాం బాపూ

  • అత్యాచారం కేసులో శిక్షను అనుభవిస్తున్న ఆశారాం
  • నకిలీ బాబాగా ప్రకటించిన భారతీయ అక్షర పరిషద్
  • ప్రశ్నించిన మీడియాపై చిర్రుబుర్రులు
గుర్మీత్ రామ్ రహీమ్ కన్నా ముందు అత్యాచారం కేసులో దోషిగా నిరూపితుడై, జైల్లో మగ్గుతున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ, తనని తాను గాడిదగా చెప్పుకున్నాడు. మరో కేసులో విచారణ నిమిత్తం ఆశారాం బాపూను కోర్టుకు తీసుకు వచ్చిన వేళ, ఆయన్ను చుట్టుముట్టిన మీడియా, భారతీయ అక్షర పరిషద్ చేసిన ఆరోపణలను గుర్తు చేసింది.

ఆశారాం సాధువు కాదని, గురువు కాదని పరిషద్ చేసిన ప్రకటనపై స్పందించాలని కోరగా, చిరాకుగా స్పందించిన ఆశారాం, తాను గాడిదల జాతికి చెందిన వాడినని చెప్పి విసురుగా వెళ్లిపోయారు. కాగా, ఇటీవల భారతీయ అక్షర పరిషద్, నకిలీ బాబాలు, సాధువుల జాబితాను విడుదల చేస్తూ, అందులో ఆశారాం బాపూ, ఆయన కుమారుడు నారాయణ్ సాయి పేర్లను చేర్చిన సంగతి తెలిసిందే.
donkey
asaram bapu
akshara parkshad

More Telugu News